BMW X1 sDrive18i M Sport | లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. భారత్ మార్కెట్లోకి తన ఎక్స్ సిరీస్లో మరో కారు తీసుకొచ్చింది. బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎస్ డ్రైవ్ 18ఐ ఎం స్పోర్ట్ అనే పేరుతో ఆవిష్కరించిన ఈ కారు ధర రూ.48.90 లక్షలు. 1.5 లీటర్ల త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 4400-6500 ఆర్పీఎం వద్ద 136 హెచ్పీ విద్యుత్, 1500-4000 ఆర్పీఎం వద్ద 230 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. కేవలం 9.2 సెకన్లలో 100 కి.మీ స్పీడ్తో దూసుకెళ్లగలదు.7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కూడా ఉంది. కార్లు ప్రీ-బుకింగ్ చేసుకున్న వారికి వచ్చే నెల నుంచి డెలివరీ ప్రారంభిస్తుంది. ఈ కారు పట్ల ఆసక్తి గల కొనుగోలు దారులు రూ.1.5 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
స్పోర్టియర్ ఫ్రంట్ అండ్ రేర్ బంపర్ డిజైన్ విత్ గ్లాస్ బ్లాక్ ఇన్ సర్ట్స్, అల్ల్యూమినియం ఇన్ సర్ట్స్ విత్ ‘ఎం’ ఇన్ స్క్రిప్షన్, ఎం-స్పెసిఫిక్ 18 -అంగుళాల డ్యుయల్ స్పోక్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. ఎం-పొర్టిమావో బ్లూ, ఆల్పైన్ వైట్, బ్లాక్ షఫైర్, స్పేస్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుకోవచ్చు.
అప్ రైట్ ఫ్రంట్ ఎండ్ విత్ స్లీకర్ లుకింగ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, లార్జ్ స్క్వేర్ షేప్డ్ బీఎండబ్ల్యూ కిడ్నీ గ్రిల్లె, అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్ విత్ హై బీమ్ అసిస్టెంట్, స్క్వేర్ వీల్ ఆర్చ్ కౌంటర్స్, స్లీకర్ టెయిల్ గేట్ విండో, 3డీ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ వస్తాయి.
బీఎండబ్ల్యూ లైవ్ కాక్ పిట్ ప్లస్ విత్ బీఎండబ్ల్యూ కర్వ్డ్ డిస్ ప్లే, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే, 10.7 అంగుళాల కంట్రోల్ డిస్ ప్లే, డిజిటల్ కీ ప్లస్, పార్కింగ్ అసిస్టెంట్, రివర్సింగ్ అసిస్టెంట్, మై బీఎండబ్ల్యూ యాప్ విత్ రిమోట్ ఫంక్షన్స్, హార్మాన్ కార్డూన్ సరౌండ్ సౌండ్ హీ-ఫై లౌడ్ స్పీకర్ సిస్టమ్ విత్ 12 స్పీకర్స్, డిజిటల్ ఆంప్లిఫ్లయర్, ఎం లెదర్ స్టీరింగ్ వీల్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి.
సేఫ్టీ కోసం బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎం స్పోర్ట్ కారు ఈ-యాక్టివ్ పార్క్ డిస్టెన్స్ కంట్రోల్ విత్ సెన్సర్స్ ఎట్ ది ఫ్రంట్ అండ్ రేర్, రేర్ వ్యూ కెమెరా ఇన్ క్లూడింగ్ పనోరమ రేర్ వ్యూ, పార్కింగ్ అసిస్టెంట్, రివర్సింగ్ అసిస్టెంట్, అటెంటివ్ నెస్ అసిస్టెంట్, లేన్ డిపార్చర్ వారనింగ్ విత్ స్టీరింగ్ ఇంటర్ వెన్షన్, డైనమిక్ క్రూయిజ్ కంట్రోల్ విత్ బ్రేకింగ్ ఫంక్షన్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అండ్ పెడిస్ట్రియన్ / సైక్లిష్ట్ ప్రొటెక్షన్ తదితర ఫీచర్లు ఉంటాయి. వీటితోపాటు ఆరు ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ విత్ బ్రేక్ అసిస్ట్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్, క్రాష్ సెన్సర్ తదితర ఫీచర్లతో వస్తున్నది.