న్యూఢిల్లీ : భభారత్లో బజాజ్ డామినర్ 400ను బజాజ్ ఆటో లాంఛ్ చేసింది. డిజైన్ మార్పులతో పాటు నూతన ఫీచర్లతో అరోరా గ్రీన్, చార్కోల్ బ్లాక్ కలర్స్‌లో న్యూ డామినర్ 400 దేశీ మార్కెట్లో రూ 2,16,648కి అందుబాటులో ఉంది. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ యాక్సెసరీస్‌తో ఈ బైక్ రైడర్స్‌కు భద్రతతో కూడిన ప్రయాణంతో పాటు మెరుగైన టూరింగ్ అనుభూతిని అందిస్తుందని బజాజ్ ఆటో లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్ నారాయణ్ సుందరరామన్ పేర్కొన్నారు.
బీఎస్ 6 373.3 సీసీ లిక్విడ్ కూల్డ్ డీఓహెచ్సీ ఎఫ్ఐ ఇంజన్‌తో పాటు నావిగేషన్ డివైజ్ అమర్చుకునే వెసులుబాటుతో పాటు యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ వంటి పలు ఫీచర్లను జోడించినట్టు తెలిపారు.