న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అదరగొట్టింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.16,891 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.9,164 కోట్ల లాభంతో పోలిస్తే 84 శాతం వృద్ధిని సాధించింది.
సమీక్షకాలంలో బ్యాంక్ రూ.1,28,467 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది సమకూరిన రూ.1,18,193 కోట్లతో పోలిస్తే ఇది 8.69 శాతం అధికం. దీంట్లో వడ్డీల రూపంలో రూ.1,17,427 కోట్లు సమకూరినట్లు బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది.