న్యూఢిల్లీ, మే 4: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ళు కేంద్ర ప్రభుత్వ అంచనాలకు చేరుకోలేకపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.23.40 లక్షల కోట్ల పన్ను వసూలయ్యాయి. అంతక్రితం ఏడాది వసూలైనదాంతో పోలిస్తే 5 శాతం పెరిగినప్పటికీ బడ్జెట్ అంచనా వేసిన రూ.24.21 లక్షల కోట్లకు చేరుకోలేకపోయాయి.
దీంట్లో కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.11.09 లక్షల కోట్లకు చేరుకోగా, వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు రూ.13.12 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.