హైదరాబాద్, జూలై 26: ఆసియాలోనే అతిపెద్ద డయాలిసిస్ సేవల సంస్థ నెప్రోప్లస్ బ్రాండ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నెప్రోకేర్ హెల్త్ సర్వీసెస్..పబ్లిక్ ఇష్యూకి(ఐపీవో)కి సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. ప్రమోటర్టు, వాటాదారులకు చెందిన 1.27 కోట్ల షేర్లను బహిరంగ మార్కెట్లో విక్రయించడం ద్వారా రూ.353.4 కోట్ల వరకు నిధులు సమీకరించాలని యోచిస్తున్నది. ఇలా సేకరించిన నిధుల్లో రూ.129 కోట్లను నూతన డయాలిసిస్ క్లినిక్లను తెరువడానికి, మరో రూ.136 కోట్లను రుణాలను తీర్చడానికి వినియోగించనున్నది.