హైదరాబాద్, సెప్టెంబర్ 9 : హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ప్రారంభించినట్టు నెమెట్షెక్ గ్రూపు ప్రకటించింది. భారత్‌లో వ్యాపార విస్తరణలో భాగంగా నగరంలో జీసీసీని నెలకొల్పినట్టు, ఈ సెంటర్ నుంచే తమ క్లయింట్లకు టెక్నాలజీ సేవలు అందించనున్నట్టు కంపెనీ సీఎఫ్‌వో లౌసి ఆఫ్వెర్స్టార్మ్ తెలిపారు.
అడాన్స్ రీసర్చ్, వినూత్న సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అంతర్జాతీయ టీంతో కలిసి ఈ సెంటర్‌ను నిర్వహించనున్నట్టు చెప్పారు. 250 మంది సామర్థ్యం కలిగిన ఈ సెంటర్‌ను భవిష్యత్తులో ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్టు ప్రకటించారు.