న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ప్రముఖ డయాల్సిస్ సేవల సంస్థ నెఫ్రోప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ ఎట్టకేలకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాబోతున్నది. ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు రూ.353 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నది.
ఆఫర్ ఫర్ సేల్ రూట్లో 1.12 కోట్ల ప్రమోటర్ల షేర్లను బహిరంగ మార్కెట్లో విక్రయించనున్నది. ప్రమోటర్లలో ఇన్వెస్ట్‌కార్ప్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్-2, హెల్త్‌కేర్ పేరెంట్ ఇన్వెస్ట్కార్ప్తోపాటు ఇతర సంస్థలు కూడా ఉన్నాయి. ఇలా సేకరించిన నిధుల్లో రూ.129.1 కోట్లను నూతన డయాల్సిస్ క్లినిక్‌లను ప్రారంభించడానికి, మరో రూ.136 కోట్లను రుణాలను తీర్చడానికి, ఇతర మిగులు నిధులను భవిష్యత్తు వ్యాపార విస్తరణ కోసం కేటాయించనున్నది.