హైదరాబాద్, నవంబర్ 14 : ప్రముఖ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన నాట్కో ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.517.9 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.676.5 కోట్ల లాభంతో పోలిస్తే 23.44 శాతం తగ్గింది. ఆర్అండ్డీ ఖర్చులు అధికం కావడం, ఉద్యోగులకు బోనస్ చెల్లింపులు జరపడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.1,371.1 కోట్ల నుంచి రూ.1,363 కోట్లకు పడిపోయింది.
నిర్వహణ ఖర్చులు రూ.616.7 కోట్ల నుంచి రూ.848.30 కోట్లకు పెరిగినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.1.50 మధ్యంతర డివిడెండ్‌ను సంస్థ ప్రకటించింది.