NASSCOM | న్యూఢిల్లీ, ఆగస్టు 26: ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కాం చైర్‌పర్సన్‌గా సింధు గంగాధరన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె శాప్ ల్యాబ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతవారంలో రాజేశ్ నంబియర్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానాన్ని ఆమె భర్తిచేశారు.
గ్లోబల్ ఇన్నోవేషన్ లీడర్‌గా భారత్ ఆవిర్భంచడంలో నాస్కాం కీలక పాత్ర పోషించింది..మన దేశం యొక్క బలమైన ఇంజినీరింగ్ ఆర్అండ్డీ సామర్థ్యాలు, వినూత్న సామర్థ్యం, విసృతమైన డిజిటల్ నిపుణులతో స్థిరమైన వృద్ధిని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆమె అన్నారు.