NR Narayana Murthy | ఆ దేశాలతో పోటీ పడాలంటే యువత 70 గంటలు పని చేయాల్సిందే.. ఇన్ఫీ నారాయణమూర్తి కుండబద్ధలు
NR Narayana Murthy | దేశంలోని పని సంస్కృతిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో ఇతర దేశాలతో భారత్ పోటీ పడాలంటే యువతరం వారానికి 70 గంటలు పని చేయడానికి సిద్ధ పడాలని పేర్కొన్నారు.
NR Narayana Murthy | దేశంలోని పని సంస్కృతిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో ఇతర దేశాలతో భారత్ పోటీ పడాలంటే యువతరం వారానికి 70 గంటలు పని చేయడానికి సిద్ధ పడాలని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ మోహన్ దాస్ పాయి ఆధ్వర్యంలోని 3 వన్ 4 క్యాపిటల్ పాడ్ కాస్ట్ ‘ది రికార్డ్’ తొలి ఎపిసోడ్లో ఎన్ఆర్ నారాయణ మూర్తి పాల్గొన్నారు.
జపాన్, జర్మనీ తదితర దేశాల్లో అదనపు పని గంటల విధానం అమలు చేస్తున్నారని నారాయణ మూర్తి గుర్తు చేశారు. జాతి నిర్మాణం, టెక్నాలజీ, తన కంపెనీ ఇన్ఫోసిస్ తదితరాల గురించి ఆయన కుండబద్ధలు కొట్టారు. వచ్చే 10-15 ఏండ్లకు తన విజన్ ఏమిటో వెల్లడించారు. భారత్ లో ఉత్పాదకత పెంచాలని, ప్రభుత్వం వైపు నుంచి జాప్యం నివారించాలన్నారు.
‘ప్రపంచంలోకెల్లా భారత్‌లోనే ఉత్పాదకత అతి తక్కువ. ఉత్పత్తిలో మన పని మెరుగు పర్చుకోలేకపోయినా, ప్రభుత్వంలో కొంత స్థాయి వరకూ అవినీతి తగ్గించకపోయినా.. అద్భుతమైన ప్రగతి సాధించిన దేశాలతో మనం పోటీ పడలేం’ అని నారాయణ మూర్తి స్పష్టం చేశారు. ‘నా యువతరానికి నేను చేసే రిక్వెస్ట్ ఒకటే.. ‘ఇది నా దేశం. నా దేశం కోసం నేను వారానికి 70 గంటలు పని చేస్తాను’ అని తప్పనిసరిగా ప్రతిజ్ఞ చేయాలి` అని నారాయణ మూర్తి చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

