హైదరాబాద్, సెప్టెంబర్ 5: అగ్ని ప్రమా దాల నుంచి రక్షించే పరికరాల తయారీ సంస్థనాఫ్కో..తెలంగాణలో రూ.700 కోట్ల పెట్టుబడితో ప్రత్యేక ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఈ దుబాయికి చెందిన ఈ సంస్థ మూడు దశాబ్దాల క్రితం 1991లో చిన్న సంస్థగా ప్రారంభమై..అనతి కాలంలోనే తన వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించింది.
ప్రస్తుతం సంస్థ ఫైర్ ప్రొటెక్షన్‌తోపాటు సెక్యూరిటీ సేవలకు సంబంధించిన పరికరాలను ఉత్పత్తి చేస్తున్నది. పలు అంతర్జాతీయ అవార్డులను సైతం సంస్థ సొంతం చేసుకున్నది. 2005కిగాను ఎగుమతుల్లో మహ్మద్ బిన్ రషీద్ అల్ ఏ1 మక్తూమ్ బిజినెస్ అవార్డుతోపాటు 2006, 2010, 2013లో ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నది.
ప్రధాన కార్యాలయం: దుబాయి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
ప్రారంభం: 1991
స్థాపించిన వారు: ఇంజినీర్. ఖలీద్ ఏ1 ఖతీబ్
ఉద్యోగులు: 15,000(2019 నాటికి) కీలక వ్యక్తులు: ఖైలాద్ ఏ1 ఖతీబ్(సీఈవో),అహ్మద్ ఏ1 ఖతీబ్, అలీ ఏ1 ఖతీబ్
ఉత్పత్తులు: లైఫ్ సెఫ్టీ సొల్యుషన్స్, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్స్, సెక్యూరిటీ సిస్టమ్స్, ఫైర్‌ఫైటింగ్ పరికరాలు, ఫైర్ ట్రక్స్, అంబులెన్స్, మొబైల్ హాస్పిటల్, ఏఆర్ఎఫ్ఎఫ్