హైదరాబాద్, డిసెంబర్ 22: బంగారం తాకట్టుపై రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ మరో గుర్తింపు లభించింది. అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా రిజర్వు బ్యాంక్ వర్గీకరించింది. సెంట్రల్ బ్యాంక్ నూతన స్కేల్ ఆధారిత రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ కింద మరింత సులభంగా ఆర్థిక సేవలు అందించడానికి వీలు పడనున్నదని కంపెనీ డిప్యూటీ ఎండీ జార్జ్ ఎం జార్జ్ తెలిపారు.
కంపెనీ మహోన్నత విలువతోపాటు దేశ ఆర్థికాభివృద్ధికి సానుకూలంగా తోడ్పాటునందిస్తున్నదన్నారు. అప్పర్ లేయర్ విభాగంలో గుర్తించిన 16 ఎన్బీఎఫ్సీల్లో కేరళ నుంచి చోటు లభించిన తొలి సంస్థ తమదేనని పేర్కొన్నారు. దీంతో వినియోగదారులకు వేగవంతంగా బయోమెట్రిక్ కేవైసీ చేసేందుకు అనుమతి లభించినట్లు అయిందన్నారు.