Musk and Twitter | ట్విట్టర్ ఒప్పందాన్ని ఎలాన్ మస్క్ ముగించే పనిలో నిమగ్నమయ్యారు. శుక్రవారం నాటికల్లా ఒప్పందం ముగించేలా మస్క్ ప్లాన్ చేశారు. తనకు నిధులు సమకూర్చుతున్న బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా మస్క్ చెప్పినట్లుగా తెలుస్తున్నది. ఈ పరిణామంపై వ్యాఖ్యానించేందుకు ట్విట్టర్ నిరాకరించింది. కాగా, ఈ వార్త నేపథ్యంలో ట్విట్టర్ షేర్లు 3 శాతం పెరిగాయి.
ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నారు. శుక్రవారం నాటికి ఈ ఒప్పందం రద్దు చేసుకునేలా ప్లాన్ చేసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది. బ్యాంకర్లతో జరిపిన వీడియా కాల్లో మస్క్ ఈ విషయం చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. డీల్‌ను ముగించేందుకు డెలావేర్ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన గడువుకు మస్క్ కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారనేది ఈ చర్యతో స్పష్టమవుతున్నది. మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికాతో పాటు పలు ఇతర బ్యాంకులు 13 బిలియన్ అమెరికన్ డాలర్ల డెబిట్ ఫైనాన్సింగ్ పత్రాలపై సంతకం చేసే ప్రక్రియలో ఉన్నాయి. ఇది మస్క్‌కు నగదు పంపే చివరి ప్రక్రియగా భావిస్తున్నారు. గురువారం నాటికి మస్క్ ఈ నగదును పొందే అవకాశాలు ఉన్నాయి.
ఇదే సమయంలో, రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఫైనాన్సింగ్ కమిట్మెంట్లకు అవసరమైన పత్రాల కోసం ఈక్విటీ పెట్టుబడిదారులతో కలిసి సీక్వోయా, బినాన్స్, ఖతర్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఎలాన్ మస్క్ లాయర్ల నుంచి అభ్యర్థనలు స్వీకరించాయి. ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి 46.5 బిలియన్ అమెరికన్ డాలర్ల ఈక్విటీ, డెబిట్ ఫైనాన్సింగ్‌కు ఎలాన్ మస్క్ కట్టుబడి ఉన్నాడు. దీనిలో 44 బిలియన్ అమెరికన్ డాలర్లు డీల్ ముగింపు ఖర్చులుగా ఉన్నాయి. మరోవైపు మస్క్ తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నారన్న వార్త వెలువడిన తర్వాత ట్విట్టర్ షేరు ధర 2.41 శాతం పెరిగి 52.78 అమెరికన్ డాలర్‌కు చేరుకున్నది. ఇది మస్క్ చేసిన ఆఫర్ ధర 54.20 అమెరికన్ డాలర్‌కు దగ్గరగా ఉండటం విశేషం.
ఈ నెల ప్రారంభంలో ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఒప్పందంపై యూటర్న్ తీసుకున్నాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను కొనుగోలు చేయడానికి మస్క్ అంగీకరించాడు. ఈ ఒప్పందంపై ట్విట్టర్‌కు లేఖ రాశారు. న్యాయ పోరాటాన్ని ముగించి లావాదేవీ పూర్తి చేయాలని లేఖలో పేర్కొన్నారు. ట్విటర్ X – ది ఎవ్రీథింగ్ యాప్‌ని రూపొందించే దిశగా అడుగుపడింది అని ఒప్పందంపై యూటర్న్ తీసుకున్న తర్వాత మస్క్ ట్వీట్ చేశాడు.