Duleep Trophy : దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్(South Zone) బ్యాటర్లు విఫలమయ్యారు. దేవ్‌దత్ పడిక్కల్(62) అర్ధ శతకంతో మెసినా.. ఈస్ట్ జోన్ పేస్ ద్వయం ముకేశ్ కుమార్(2-36), మహమ్మద్ షమీ(2-17)ల ధాటికి మిడిలార్డర్ క్రీజులో నిలవలేదు. వీరిద్దరి విజృంభణలో 174 పరుగులకే సౌత్ ఐదు వికెట్లు కోల్పోయింది. కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరడంతో కెప్టెన్ తిలక్ వర్మ(37 నాటౌట్), శ్రేయాస్ గోపాల్(8 నాటౌట్) ఆచితూచి ఆడుతున్నారు.
ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ బ్యాటర్లు తడబడుతున్నారు. తేలిపోయారు. చిదంబరం స్టేడియంలో ఈస్ట్ బౌలర్లు ముకేశ్ కుమార్(2-36), మహమ్మద్ షమీ(2-17)లు ఆదిలోనే వికెట్లు తీసి దెబ్బతీశారు. మూడో రోజు తొలి సెషన్లోనే రికీ భుయి(1)ని ముకేశ్ పెవిలియన్ పంపగా.. మరో ఓపెనర్ నారాయణ్ జగదీశన్(32)ను శిఖర్ మోహన్ ఔట్ చేశాడు. అంతే.. 70 పరుగులకే రెండు వికెట్లు పడ్డాయి.
Shami-Mukesh combo strikes 🤝
The pace bowling duo dismiss set batters Shaik Rasheed and Devdutt Padikkal and breaks 56-run stand 🙌
South Zone are 134/4, trail by 574 runs.
Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/NAvgCYBdkA
— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2026
ఓపెనర్లు విఫలమైనా దేవదత్ పడిక్కల్(62) అర్ధ శతకంతో మెరిశాడు. శ్రీలంక పర్యటనలో సెంచరీలతో చెలరేగిన ఈ లెఫ్ట్ హ్యాండర్ఈస్ట్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని స్కోర్ బోర్డును నడిపించాడు. అయితే.. అతడిని ముకేశ్ వెనక్కి పంపి రెండో వికెట్ సాధించాడు. ఆపై షేక్ రషీద్(27), స్మరణ్ రవిచంద్రన్(23)లను షమీ బోల్తా కొట్టించాడు. అంతే.. 174కే ఈస్ట్ సగం వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ తిలక్ వర్మ(37 నాటౌట్) శ్రేయాస్ గోపాల్(8 నాటౌట్)లు కీలక భాగస్వామ్యంతో ఆదుకునే పనిలో ఉన్నారు. ఆరో వికెట్‌కు వీరు రన్స్ జోడించారు. 206/5తో ఉన్న సౌత్ ఇంకా 502 పరుగులు వెనకబడి ఉంది.