Mercedes Benz | మెర్సిడెజ్ బెంజ్..మరో ఎలక్ట్రిక్ మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. మేబ్యాచ్ ఈక్యూస్ 680 ఎస్యూవీ ప్రారంభ ధర రూ.2.25 కోట్లుగా నిర్ణయించింది. ఈ ధరలు ముంబై షోరూంనకు సంబంధించినవి.
107.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో తయారైన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 611 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. కేవలం 4.4 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ మాడల్ గంటకు 210 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. కేవలం అరగంటలోనే 80 శాతం వరకు చార్జింగ్ కానున్నది.