Forbes List | రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మరోరసారి ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన భారత్‌లోని 100 మంది సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఈసారి టాప్-100లో చోటు సంపాదించిన సంపన్నులు సంపద తొలిసారి నికర విలువలో ట్రిలియన్ డాలర్లు దాటినట్లు నివేదిక పేర్కొంది. ఇది భారత్‌లో వ్యాపార వృద్ధి, ఆర్థిక శక్తిని ప్రదర్శిస్తుందని నివేదిక పేర్కొంది. రిలయన్స్ ఇన్వెస్టర్లకు దీపావళి కానుకగా ముకేశ్ అంబానీ ఇటీవల బోనస్ షేర్లను ప్రకటించారు. గత సంవత్సరంలో ముకేశ్ అంబానీ భారీ లాభాలను ఆర్జించారు. ఆదాయం 27.5 బిలియన్ డాలర్లు పెరిగి 119.5 బిలియన్లకు చేరుకుంది. ప్రస్తుత నికర విలువ 108.3 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో 13వ సంపన్న వ్యక్తిగా నిలిచినట్లు ఫోర్బ్స్ పేర్కొంది.
ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలోని టాప్ వంద మంది వ్యక్తుల్లో 2024లో మొత్తం సంపద 1.1 ట్రిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరిందని పేర్కొంది. 2023లో 799 బిలియన్ డాలర్ల ఉండేదని.. ఇది ప్రస్తుతం 40శాతం వరకు పెరిగిందని చెప్పింది. బలీయమైన స్టాక్ మార్కెట్, ఐపీఓలు, మ్యూచువల్ ఫండ్స్ ధనవంతులను కుబేరులుగా మారుస్తందని ఫోర్బ్స్ పేర్కొంది. గత ఏడాది నుంచి బీఎస్ఈ సెన్సెక్స్ 30శాతం లాభపడడంతో మార్కెట్ రికార్డు స్థాయికి చేరుకుంది. ఫలితంగా జాబితాలో ఉన్న వారిలో 80శాతం కంటే ఎక్కువ మంది సంపన్నులు, 58 మంది తమ నికర విలువకు బిలియన్ డాలర్ల సంపదను జోడించినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఇక ఈ జాబితాలో 116 బిలియన్ డాలర్ల సంపదతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రెండోస్థానంలో నిలిచారు. ఆయన సోదరుడు వినోద్ అదానీతో కలిసి 48 బిలియన్ డాలర్ల సంపదను జోడించి.. ఈ ఏడాది అత్యధిక డాలర్ గెయినర్స్‌గా నిలిచారని పేర్కొంది.