Mukesh Ambani | భారతీయ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన కీర్తి కిరీటంలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రపంచ కుబేరుల్లో రూ.7588,28,15,000 (100 బిలియన్ డాలర్ల) క్లబ్లో చోటు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు ఆ జాబితాలో టెస్లా సీఈవో ఎలన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వంటి కొద్ది మంది మాత్రమే ఉండేవారు.
శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ స్క్రిప్ట్ విలువ రికార్డు స్థాయికి చేరుకోవడంతో ముకేశ్ అంబానీ సంపద విలువ 100 బిలియన్ల డాలర్లు దాటింది. ఈ ఏడాదిలో ఆయన సంపద 23.8 బిలియన్ల డాలర్లు పెరిగింది. దీంతో ఆయన వ్యక్తిగత సంపద 101 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. మూడేండ్లలో గ్రీన్ ఎనర్జీపై 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ముకేశ్ అంబానీ గత జూన్లో తెలిపారు. ఇక 2030 నాటికి రెన్యూవబుల్ ఎనర్జీ వనరుల నుంచి కనీసం 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధిస్తామని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎలన్ మస్క్ సంపద 222 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్ 191 బిలియన్ డాలర్లు, బెర్నార్డ్ అర్నాల్ట్ 156 బిలియన్ డాలర్లు, బిల్ గేట్స్ 128 బిలియన్ డాలర్లు, లారీ పేజ్ 125 బిలియన్ డాలర్లు, మార్క్ జుకర్ బర్గ్ 123 బిలియన్ల డాలర్లు, సెర్గీ బ్రిన్ 120 బిలియన్ల డాలర్లు, లారీ ఎలిసన్ 108 బిలియన్ డాలర్లు, స్టీవ్ బామర్ 106 బిలియన్ డాలర్లు, వారెన్ బఫెట్ 103 బిలియన్ డాలర్లకు చేరుకున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఐఎంపీఎస్ పరిమితి 5 లక్షలకు పెంపు
Offline Digital Payments | త్వరలో ఆఫ్లైన్ డిజిటల్ పేమెంట్స్
US trillion dollar coin | అమెరికా ఖజానా ఖాళీ.. ఆ ఒక్క నాణెం అగ్ర రాజ్యాన్ని రక్షిస్తుందా?
Guinness Record : రెండు చక్రాలపై మూడు చక్రాల బండి.. చెన్నై వాసి గిన్నీస్ రికార్డ్