RSS centenary | ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాలు.. సల్మాన్, అక్షయ్, రణబీర్ సహా బాలీవుడ్ స్టార్స్ హాజరు
RSS centenary : రాష్ట్రీయ స్వయం స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) శతాబ్ది ఉత్సవాలు ముంబైలో జరుగుతున్నాయి. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ వేడుకలకు ముంబైలోని బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు.
RSS centenary : రాష్ట్రీయ స్వయం స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) శతాబ్ది ఉత్సవాలు ముంబైలో జరుగుతున్నాయి. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ వేడుకలకు ముంబైలోని బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ వంటి బాలీవుడ్ స్టార్స్ హాజరవ్వడం ప్రత్యేకంగా నిలిచింది.
బాలీవుడ్‌కు చెందిన టాప్ స్టార్స్, నిర్మాతలు, దర్శకులు సహా ప్రముఖులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. హిందూ సంస్థగా ముద్ర ఉన్న ఆరెస్సెస్ శతాబ్ది వేడుకలకు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరవ్వడం ఆసక్తికరంగా మారింది. ‘100 ఇయర్స్ ఆఫ్ సంఘ్ జర్నీ : న్యూ హారిజాన్స్’ పేరుతో, ముంబై, వర్లీలోని నెహ్రూ సెంటర్లో నిర్వహించిన ఈ వేడుకలకు ఆరెస్సెస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ అధ్యక్షత వహించారు. వేడుకలకు హాజరైన బాలీవుడ్ స్టార్స్ ఆరెస్సెస్ నేతలతో కలిసి చర్చిస్తూ కనిపించారు. అందరి ఉపన్యాసాలను శ్రద్ధగా విన్నారు. సాధారణంగా బాలీవుడ్ స్టార్స్ ఇలాంటి వేడుకలకు చాలా దూరంగా ఉంటారు. కానీ, శని, ఆదివారాల్లో జరిగిన వేడుకలకు బాలీవుడ్ మొత్తం హాజరైనట్లు కనిపించింది. కొందరు శనివారం హాజరైతే.. ఇంకొందరు ఆదివారం అతిథులుగా వచ్చారు.
సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, దర్శకులు మోహిత్ సూరి, కరణ్ జోహార్, నితీష్ తివారి, ఓం రౌత్, సుభాష్ ఘయ్, మహా వీర్ జైన్, విక్రమ్ మల్హోత్రా, గేయ రచయిత ప్రసూన్ జోషి, నటి అనన్యా పాండే, రవీనా టాండన్, శిల్పా శెట్టి, జాకీ ష్రాఫ్, రూపాలి గంగూలి, వినీత్ కుమార్ సింగ్, మాధుర్ భండార్కర్, మహేష్ మంజ్రేకర్, ఆనంద్ ఎల్ రాయ్, అమర్ కౌషిక్, అమిత్ శర్మ, రమేష్ తౌరాని, ఆనంద్ పండిట్, పూనమ్ ధిల్లాన్, హేమా మాలిని, అద్నాన్ సమీ, ప్రీతమ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam Project | నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు.. రేవంత్ సర్కార్ వైఫల్యంతో శ్రీశైలం ఖాళీ!
YTPS | తెలంగాణ ఇంజినీర్లపైనే వేటు.. వైటీపీఎస్‌లో ఆంధ్రా అధికారులకు పెత్తనం
KCR | ఇదీ.. కేసీఆర్ పాలనాదక్షత.. కాళేశ్వరం నీటితో మత్తడి దుంకుతున్న వెలిచాల చెరువులు
CM Commission | సీఎం కమీషన్ 15%.. టెండర్లు, బిల్లుల చెల్లింపులో విచ్చలవిడి అవినీతి
KTR | విదేశీ బొగ్గులో.. 3 వేల కోట్ల సామ్.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లేఖ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

