Moto G75 5G | లెనోవో అనుబంధ మోటరోలా (Motorola) కు చెందిన మోటో జీ75 5జీ ఫోన్ సెలెక్టెడ్ ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఆవిష్కరించింది. 8 జీబీ ర్యామ్ తోపాటు స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ స్క్రీన్‌తోపాటు 6.78 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. వైర్డ్, వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటది. త్వరలో భారత్ మార్కెట్లోకి రానున్నదీ ఫోన్.
మోటో జీ75 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.27 వేలు (299 యూరోలు) పలకుతుంది. ఆక్వా బ్లూ, చార్ కోల్ గ్రే, సుక్కులెంట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. లాటిన్ అమెరికా, ఆసియా-ఫసిపిక్ రీజియన్ పరిధిలోని సెలెక్టెడ్ మార్కెట్లలో లభిస్తుందీ ఫోన్. మోటో జీ75 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉండే మోటో జీ75 5జీ ఫోన్ 5ఎన్ఎం ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. వర్చువల్ గా ఫోన్ ర్యామ్ 16 జీబీ వరకూ, మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు.
మోటో జీ75 5జీ ఫోన్లో 50-మెగా పిక్సెల్ సోనీ ల్వైథియా 600 సెన్సర్ విత్ ఓఐఎస్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ మాక్రో విజన్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఏ-జీపీఎస్, ఎల్టీఈపీపీ, గ్లోనాస్, గెలిలియో, క్యూజడ్ఎస్ఎస్, ఎన్ఎఫ్ సీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ విత్ సపోర్ట్ ఫర్ ఫేస్ అన్ లాక్ ఫీచర్ ఉంటుంది. 30వాట్ల వైర్డ్, 15 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందీ ఫోన్.