Moto G35 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మోటో జీ35 5జీ (Moto G35 5G) ఫోన్‌ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. యూనిసోక్ టీ760 ప్రాసెసర్, 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాలతో వచ్చింది. కార్నింగ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తోపాటు 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. మోటో జీ55 ఫోన్ తోపాటు మోటో జీ35 5జీ ఫోన్ కూడా సెలెక్టెడ్ యూరప్ మార్కెట్లలో గత ఆగస్టు నెలలో ఆవిస్కరించింది.
మోటో జీ35 5జీ ఫోన్ 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999 పలుకుతుంది. ఫ్లిప్ కార్ట్, మోటరోలా ఇండియా ఆన్ లైన్ స్టోర్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. గువా రెడ్, లీఫ్ గ్రీన్, మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హెల్లో యూఐ స్కిన్ ఓఎస్ వర్షన్‌పై పని చేస్తున్న ఫోన్ విజన్ బూస్టర్, నైట్ విజన్ మోడ్‌లో అందుబాటులో ఉంది. 50-మెగా పిక్సెల్ క్వాడ్ పిక్సెల్ ప్రైమరీ రేర్ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
డోల్బీ అట్మోస్ బ్యాక్డ్ స్టీరియో స్పీకర్స్ తో వస్తున్న మోటో జీ35 5జీ ఫోన్ సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింటర్ సెన్సర్ ఉంటుంది. దీంతోపాటు ప్రాగ్జిమిటీ సెన్సర్, యాక్సెలరోమీటర్, అంబియెంట్ లైట్, గైరోస్కోప్, ఎస్ఏఆర్ సెన్సర్, ఈ- కంపాస్ సెన్సర్ తదితరాలు ఉంటాయి. 20 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ వస్తుంది. 5జీ, డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, ఏ-జీపీఎస్, గ్లోనాస్, గెలిలియో, క్యూజడ్ఎస్ఎస్ 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.