Mother Dairy Milk Price Rise | అమూల్ బాటలోనే మదర్ డైరీ.. లీటర్ పాల ధర రూ.2 పెంపు!
Mother Dairy Milk Price Rise | అమూల్ బాటలోనే మదర్ డెయిరీ కూడా పయనిస్తున్నది. ఆదివారం నుంచి లీటర్ పాల ధర రూ.2 పెరుగనున్నది.
Mother Dairy Milk Price Rise | అమూల్ బాటలో మదర్‌డైరీ పాల ధరలు పెంచేసింది. ఢిల్లీ-దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో లీటర్ పాల ధర రూ.2 పెంచుతున్నట్లు శనివారం ప్రకటించింది. పెంచిన ధరలు ఆదివారం (మార్చి 6) నుంచి అమల్లోకి రానున్నాయి. ఇంతకుముందు అమూల్, పరాగ్ మిల్క్ కూడా లీటర్ పాలపై రెండు రూపాయలు పెంచాయి. ప్రస్తుతం రూ.57 ఉన్న ఫుల్ క్రీమ్ మిల్క్ లీటర్ ధర ఆదివారం నుంచి రూ.59 కానున్నది.
టోన్డ్ మిల్క్ లీటర్ ధర రూ.49లకు, డబుల్ టోన్డ్ మిల్క్ ధర రూ.43 లకు పెంచేసింది. లీటర్ ఆవు పాలు రూ.49 నుంచి రూ.51కి పెంచుతున్నట్లు మదర్‌డైరీ వెల్లడించింది. వెండింగ్ మిల్క్ (టోకెన్ మిల్క్) ధర లీటర్‌పై రూ.44 నుంచి రూ.46లకు పెంచింది. ఇంతకుముందు అమూల్, గోవర్ధన్ డైరీ సంస్థలు లీటర్ పాల ధర మార్చి ఒకటో తేదీ నుంచి పెంచివేసింది. ఎఫ్ఎంసీజీ డెయిరీ కంపెనీ పరాగ్ మిల్క్.. గోవర్ధన్ బ్రాండ్ ఆవు పాలు లీటర్‌పై రూ.2 పెంచింది.
మదర్ డెయిరీ పెంచిన ధరవరలు ఇలా
బల్క్ వెండెడ్ మిల్క్ (టోకెన్ మిల్క్) — — లీటర్ —- —- రూ.44 నుంచి రూ.46కి పెంపు
ఆల్ట్రా ప్రీమియం మిల్క్ — — —- —– — 500 ఎంఎల్ — రూ.31 నుంచి రూ.32కి పెంపు
ఫుల్ క్రీం మిల్క్ —— —— —— —– —- లీటర్ —– — రూ.57 నుంచి రూ.59కి పెంపు
ఫుల్ క్రీం మిల్క్ —— —— —— —– —– 500ఎంఎల్ — రూ.29 నుంచి రూ.30కి పెంపు
టోన్డ్ మిల్క్ ——- ——- ——- —— —– లీటర్ —– — రూ.47 నుంచి రూ.49కి పెంపు
టోన్డ్ మిల్క్ ——- ——- ——- —— —– 500ఎంఎల్ — రూ.24 నుంచి రూ.25కి పెంపు
డబుల్ టోన్డ్ మిల్క్ ——- ——- —— —- లీటర్ —– — రూ.41 నుంచి రూ.43కి పెంపు
డబుల్ టోన్డ్ మిల్క్ ——- ——- ——- — 500ఎంఎల్ — రూ.21 నుంచి రూ.22కి పెంపు
ఆవు పాలు ——- ——- ——- ——- —– లీటర్ —– —- రూ.49 నుంచి రూ.51కి పెంపు
ఆవు పాలు ——- ——- ——- ——- —– 500 ఎంఎల్ — రూ.25 నుంచి రూ.26కి పెంపు
సూపర్ టీ మిల్క్ ——- ——- ——– —– 500 ఎంఎల్ — రూ.26 నుంచి రూ.27కి పెంపు
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- amul
- Milk Rates
- Mother Dairy
RELATED ARTICLES
తాజా వార్తలు
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

