Adani Group Stocks | డిసెంబర్ త్రైమాసికంలో మెరుగైన లాభాలు గడించడంతో అదానీ ఎంటర్ ప్రైజెస్ మినహా అదానీ గ్రూప్ సంస్థల్లో పలు స్టాక్స్ మంగళవారం నష్టాల్లోనే ముగిశాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ దాదాపు రెండు శాతం లాభంతో ముగిసింది. ఏడు లిస్టెడ్ కంపెనీలు నష్టాల్లో సాగితే, మూడు స్క్రిప్ట్‌లు లాభాలు గడించాయి. `మంగళవారం పది లిస్టెడ్ కంపెనీల్లో ఏడు నష్టాల్లో ముగియడంతో అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.1 శాతం పడిపోయింది. జనవరి 24తో పోలిస్తే అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 54.2 శాతం పతనమైంది` అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్ ఆఫ్ రిటైల్ రీసెర్చ్ దీపక్ జాసానీ తెలిపారు.
బీఎస్ఈలో అదానీ ఎంటర్ప్రైజెస్ స్క్రిప్ట్ 1.91 శాతం లాభంతో రూ.1,750.30 వద్ద నిలిచింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 17.23 శాతం పెరిగి రూ.1,889కి చేరుకున్నది. డిసెంబర్ త్రైమాసికంలో అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.820.06 కోట్ల నికర లాభం సంపాదించినట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ సోమవారం ప్రకటించింది. గతేడాది 2021-22లో రూ.11.63 కోట్ల నష్టం వాటిల్లింది. 2021-22తో పోలిస్తే రెవెన్యూ 42 శాతం పెరిగి రూ.26,612.33 కోట్లకు చేరింది. అదానీ పోర్ట్స్ అండ్ ఎకనమిక్ స్పెషల్ జోన్ 2.15 శాతం (రూ.565.10), ఏసీసీ 0.41 శాతం (రూ.1830.85)కు పెరిగింది.
అదానీ పవర్ రూ.148.30, అదానీ ట్రాన్స్మిషన్ రూ.1070.55, అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.653.40, అదానీ టోటల్ గ్యాస్ రూ.1135.60 వద్ద ముగిశాయి. అదానీ విల్మార్ రూ.393.60, ఎన్డీటీవీ రూ.188.35 వద్ద ముగిశాయి. ఈ స్క్రిప్ట్‌లు ఐదు శాతం చొప్పున నష్టపోయాయి. అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ స్టాక్స్ ఇంట్రా డే ట్రేడింగ్‌లో 52 వారాల కనిష్ట స్థాయిని తాకాయి. అంబుజా సిమెంట్స్ 1.68 శాతం నష్టంతో రూ.336.65 వద్ద ముగిసింది.