న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రస్తుతం ట్రేడవుతున్న 6,000కుపైగా క్రిప్టోకరెన్సీల్లో కొన్నింటికి మాత్రమే మనుగడ ఉంటుందని రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అంచనావేసారు. బుధవారం ఒక ఆంగ్ల ఛానల్‌తో మాట్లాడుతూ ‘మనకు చెల్లింపుల కోసం 6,000 క్రిప్టోకరెన్సీలు అవసరమా? ఒకటి లేదా రెండు… కొన్ని చాలు. క్రిపో టెక్నాలజీ ప్రయోజనకరమైతే, నగదు లేదా కరెన్సీకి ప్రత్యామ్నాయమైతే చెల్లింపుల కోసం కొన్ని క్రిప్టోలకు మాత్రమే చోటు ఉంటుంది. అంటే చాలా క్రిప్టోకరెన్సీలు అధిక విలువలతో మనుగడ సాగించే అవకాశం లేదన్న మాట’ అని అన్నారు. నియంత్రణ లేని చిట్‌ఫండ్స్ ప్రజల నుంచి డబ్బు సేకరించి ఎలా మాయమయ్యాయో…అదే సమస్య క్రిప్టోకరెన్సీలతోనూ వస్తుందన్నారు.