న్యూఢిల్లీ, నవంబర్ 13: దేశవ్యాప్తంగా పన్ను రిటర్ను దాఖలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నారు. 2024-25 అసెస్మెంట్ ఏడాదికిగాను 8 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారని ఐటీ వర్గాలు వెల్లడించాయి. వీరిలో 74 శాతం మంది నూతన పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయంపై 8 కోట్ల మంది వ్యక్తిగతంగా ఐటీఆర్ దాఖలు చేశారని, వీరిలో 5.92 కోట్ల మంది నూతన పన్ను విధానాన్ని ఎంచుకున్నారని చెప్పారు.
ఇన్వీట్స్, రీట్స్‌కు సెబీ మినహాయింపులు
న్యూఢిల్లీ, నవంబర్ 13: నిర్ధిష్ట లాక్-ఇన్, కేటాయింపు ఆంక్షల నుంచి ఇన్వీట్స్, రీట్స్‌కు బుధవారం మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ మినహాయింపునిచ్చింది. యూనిట్ బేస్డ్ ఎంప్లాయీ బెనిఫిట్ పథకాల కింద ఎంప్లాయీ బెనిఫిట్ ట్రస్ట్‌కు యూనిట్లను జారీ చేసేటప్పుడు ఈ మినహాయింపులు వర్తిస్తాయి. దీంతో ఉద్యోగులకు యూ నిట్ల పంపిణీ, సేకరణ సులభతరం కాగలదని భావిస్తున్నారు. కాగా, కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఆప్షన్లలో నిధులను గుమ్మరించడానికి మదుపరులకు రీట్స్ కలిసొస్తాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్తుల పోర్ట్‌ఫోలియోల్లో పెట్టుబడుల అవకాశాన్ని ఇన్వీట్స్ కల్పిస్తాయి.