GDP | న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఈ ఏడాదికిగాను దేశ జీడీపీ వృద్ధిరేటు అంచనాలకు మూడీస్ అనలిటిక్స్ కోత పెట్టింది. ఈసారి 6.1 శాతంగానే ఉండొచ్చని గురువారం అంచనా వేసింది. గతంలో ఇది 6.4 శాతంగా ఉండగా.. ఈ తగ్గింపులకు కారణం భారత్‌పై అమెరికా 26 శాతం ప్రతీకార సుంకాల ప్రతిపాదనలేనని ‘ఏపీఏసీ ఔట్లుక్: యూఎస్ వర్సెస్ దెమ్’ పేరిట విడుదలైన ఓ నివేదికలో మూడీస్ అనలిటిక్స్ పేర్కొన్నది.
కాగా, వాణి జ్య యుద్ధం ప్రభావంతో రత్నాలు-ఆభరణాలు, మెడికల్ డివైజెస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ రంగాలు తీవ్రంగా దెబ్బతినవచ్చని హెచ్చరించింది. ఇదిలావుంటే ఈ ఏడాది ఆఖర్లోగా ఆర్బీఐ మరో పావుశాతం రెపోరేటును తగ్గించవచ్చని, 5.75 శాతానికి తీసుకురావచ్చని మూడీస్ అభిప్రాయపడింది.