హైదరాబాద్, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌గా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఇటలీ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. సోమవారం సచివాలయంలో ఇటలీ దేశానికి చెందిన ప్రముఖ ఏర్పోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విడిభాగాల తయారీ, సరఫరా వ్యవస్థ, నిర్వహణ-మరమ్మత్తు, సమగ్ర పరిశీలన (ఎమ్మార్వో), అవియానిక్స్, రాడార్ అండ్ సెన్సార్ సిస్టమ్స్, న్యూ-స్పేస్ అండ్ చిన్న ఉపగ్రహాలు, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ కంపొజిట్స్ తయారీలో తెలంగాణలో బోలేడె అవకాశాలున్నాయన్నారు.
రాష్ట్రంలో ప్రత్యేక ఏరోస్పేస్ పారులు, సెజ్‌లు, భారీ ఎంఎస్ఎంఈ నెట్ వర్, శక్తిమంతమైన ఆర్ అండ్ డీ, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, అత్యుత్తమ ప్రతిభ గల మానవ వనరులు, పారిశ్రామిక ప్రోత్సాహాక విధానాలతో కూడిన పటిష్ఠమైన ఎకో సిస్టమ్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.