హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టాన్ని 2030 నాటికి దేశ ‘ఏరో ఇంజిన్ రాజధాని’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇందుకోసం ప్రపంచంతో పోటీపడేలా దిగ్గజ పరిశ్రమలు, ప్రముఖ విద్యాసంస్థల భాగస్వామఋ్యంతో “ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకోసిస్టమ్” ను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు సమగ్రమైన రోడ్డు మ్యాప్‌ను రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్ మెంట్, ఐఎస్బీ, ముంజాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంయుక్తాధ్వర్యంలో శనివారం ఇండియన్ సూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో నిర్వహించిన ‘ఎంపవరింగ్ ఆత్మనిర్భర్ భారత్: ఇండియాస్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏఅండ్డీ రంగ వృద్ధిని మనకు అనుకూలంగా మార్చుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు.
డీప్‌టెక్ స్టార్టప్‌లకు నిధులు సమకూర్చే లక్ష్యంతో వేల్ ట్యాంక్(డబ్ల్యూటీ) బయోకాటలిస్ట్స్ నిర్వహించిన మూడో వార్షిక సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, ఫుడ్, అగ్రిటెక్ వంటి రంగాల్లో డీప్‌టెక్ స్టార్టప్‌లకు నిధుల సమకూర్చడంపై దృష్టి సారించారు. 80 దరఖాస్తుల్లో 73ను షార్ట్‌లిస్ట్ చేశారు. వీటిలో 20 ప్రధాన పిచింగ్ సెషన్లో పాల్గొన్నాయి.