హైదరాబాద్, జూలై 16(నమస్తే తెలంగాణ) : మైనింగ్, మౌలిక సదుపాయాల రంగంలో కంట్రోల్డ్ బ్లాస్టింగ్ టెక్నాలజీని ఉపయోగించడంలో ఓ ముందడుగు పడింది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని స్వతంత్ర పరిశోధన సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్ఐఆర్ఎం), సిబీ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా కలిసి దేశవ్యాప్తంగా ప్రాజెక్టులలో సహకరించుకునేందుకు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. సిబీ సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ సిబీ లూకోస్, ఎన్ఐఆర్ఎం డైరెక్టర్ (అదనపు ఛార్జ్) డాక్టర్ శ్రీపాద్ ఆర్ నాయక్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ రెండు సంస్థలకు ఉన్న సాంకేతిక నైపుణ్యంతో దేశ వ్యాప్తంగా కీలకమైన ప్రాజెక్టులలో సురక్షితంగా, సరికొత్త సృజనాత్మక పద్ధతుల్లో బ్లాస్టింగ్ పరిషారాలు సుగమం కానున్నాయి. రాక్ ఇంజినీరింగ్, రాక్ మెకానిక్స్ లాంటి రంగాల్లో పేరుగాంచిన ఎన్ఐఆర్ఎం మైనింగ్, సొరంగాలు తవ్వ డం, రవాణా, విద్యుత్తు తదితర రంగాల్లో పరిశోధన , కన్సల్టెన్సీ, శిక్షణ కార్యకలాపాల లో గత 35 ఏళ్లుగా సేవలందిస్తున్నది.