న్యూఢిల్లీ: భారతీయ రక్షణ రంగాన్ని స్వదేశీయంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా ఇండియన్ ఆర్మీ ఇవాళ టెండర్ జారీ చేసింది. అనంత శస్త్ర(Anant Shastra) సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ వెపన్ వ్యవస్థను ఖరీదు చేయనున్నది. అయిదు లేదా ఆరు రెజిమెంట్ల మిస్సైళ్ల వ్యవస్థను ఖరీదు చేసేందుకు సుమారు 30 వేల కోట్ల టెండర్‌ను ఇండియన్ ఆర్మీ జారీ చేసినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్, చైనాతో ఉన్న సరిహద్దుల్లో రక్షణ వ్యవస్థను బలోపేతంచేయాలన్న ఉద్దేశంతో సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్‌ను ఖరీదు చేసే ఆలోచన ఉన్నది.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) సంస్థకు ఇండియన్ ఆర్మీ టెండర్ ఇచ్చింది. అనంత శస్త్ర ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్‌ను డీఆర్డీవో డెవలప్ చేఇంది. గతంలో ఈ మిస్సైల్‌ను క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టుఎయిర్ మిస్సైల్ సిస్టమ్‌గా పిలిచేవాళ్లు. 30 వేల కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా భారతీయ సైన్యానికి చెందిన వైమానిక రక్షణ వ్యవస్థ బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ మిస్సైల్ వ్యవస్థ పాకిస్థాన్ డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకున్నది.
భారతీయ ఆర్మీకి చెందిన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ.. ఎంఆర్ – సామ్, ఆకాశ్‌తో పాటు ఇతర చిన్న తరహా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఆపరేట్ చేస్తున్నది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కొత్త మిస్సైల్ వ్యవస్థ కొనుగోలు కోసం డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ క్లియరెన్స్ ఇచ్చింది.