న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26 : ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎట్టకేలకు తన 4జీ సేవలు అందించడానికి సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి తన 4జీ సేవలు ‘స్వదేశీ 4జీ నెట్వర్క్’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన టెక్నాలజీని ఇందుకు వినియోగించనున్నారు.
క్లౌడ్ ఆధారిత సేవలను 5జీ సేవలుగా అప్గ్రేడ్ చేసుకునేందుకు వీలుంటుందని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా తెలిపారు. దేశవ్యాప్తంగా 98 వేల సైట్లలో ఈ నూతన సేవలు అందుబాటులోకి రానున్నట్టు ఆయన వెల్లడించారు.