న్యూఢిల్లీ, మే 6: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్..దేశీయ మార్కెట్లోకి మరో ఈవీ మాడల్‌ను తీసుకొచ్చింది. విండ్సోర్ ప్రో పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 450 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. అదనపు ప్రీమియం ఫీచర్స్‌తో రూపొందించిన ఈ మాడల్ 52.9 కిలోవాట్ల లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీతో తయారైంది. లెవల్ 2తోపాటు అదనపు 12 ఫీచర్స్‌తో కలుపుకొని రూపొందించిన ఈ కారు క్రూజ్ కంట్రోల్, ట్రాఫిక్ జాం అసిస్ట్, ఎల్ఈడీ లైట్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఏరో-లాంజ్ సీట్లు, 15.6 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారు ధర రూ.20 లక్షలకు పైగా ఉంటుందని అంచనా.