MG Windsor EV | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) దేశీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే భారత్ మార్కెట్లో విక్రయిస్తున్న జడ్ ఎస్ ఈవీ (ZD EV), కొమెట్ ఈవీ (Comet EV) సక్సెస్‌తో మరో ఈవీ కారు క్లౌడ్ ఈవీ (CloudEV) ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది. భారత్ మార్కెట్ కోసం కంపాక్ట్ యుటిలిటీ వెహికల్ (సీయూవీ).. విండ్సార్ ఈవీ (Windsor EV) కారును త్వరలో భారత్ లో ఆవిష్కరించనున్నది. జడ్ ఎస్ ఈవీ, కొమెట్ ఈవీ తర్వాత దేశీయ మార్కెట్లోకి వస్తున్న మూడో ఈవీ కారు. కుర్రకారును ఆకర్షించే లక్ష్యంతో వస్తున్నదీ విండ్సార్ ఈవీ.
స్టైలిష్ డిజన్ తో వస్తున్న విండ్సార్ ఈవీ (Windsor EV) కారులో డైనమిక్ అల్లాయ్ వీల్స్, స్లాక్ ఎల్ఈడీ డే టైం రన్నింగ్ లైట్స్ (డీఆర్ఎల్స్), ఫుల్ విడ్త్ లైట్ బార్, ఇల్యూమినేటెడ్ ఎంజీ లోగోతోపాటు సన్ రూఫ్, టూ స్పోక్ స్టీరింగ్ వీల్, టాల్ స్టాన్స్, కూపే తరహా రూఫ్, లార్జ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీని ధర రూ.20 లక్షల (ఎక్స్ షోరూమ్) లోపు ఉంటుందని తెలుస్తోంది. త్వరలో మార్కెట్లో ఆవిష్కరించనున్న టాటా కర్వ్.ఈవీ (Tata Curvv.ev)తోపాటు టాటా నెక్సాన్.ఈవీ (Tata Nexon.ev), మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ (Mahindra XUV400 EV) కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నదని తెలుస్తున్నది.
ఎంజీ మోటార్ విండ్సార్ ఈవీ (Windsor EV) కారు రెండు బ్యాటరీ ఆప్షన్లలో వస్తోంది. 37.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో వస్తున్న ఇంజిన్ 360 కి.మీ, 50.6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో వస్తున్న ఇంజిన్ 460 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. అయితే భారత్ మార్కెట్లో జడ్ఎస్ ఈవీలో మాదిరిగా 50.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ మోటార్ ఉంటుందని సమాచారం. ఈ మోటారు గరిష్టంగా 176 హెచ్‌పీ విద్యుత్, 280 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా విండ్సార్ ఈవీ గ్లోబల్ వేరియంట్ మాత్రం గరిష్టంగా 37.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో కూడిన 134 హెచ్‌పీ మోటారుతో అందుబాటులో ఉంటుందన్న సమాచారం.
Google Pixel 9 | పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లపై గూగుల్ ఆకర్షణీయ ఆఫర్లు.. ఇవీ డీటెయిల్స్..?!
Citroen Basalt | సిట్రోన్ బసాల్ట్ ఎస్యూవీ కూపే ఆవిష్కరణ.. ఇవీ డిటెయిల్స్.. !