MG Motor-Reliance | భారత్ నుంచి వైదొలిగేందుకు ఎంజీ యత్నం.. ‘రిలయన్స్, హీరోలతో సంప్రదింపులు..?
MG Motor-Reliance | డ్రాగన్ ఆధీనంలోని ఎంజీ మోటార్.. భారత్ నుంచి నిష్క్రమించడానికి ప్రయత్నాలు చేస్తున్నది. మెజారిటీ వాటాల విక్రయానికి రిలయన్స్, హీరో తదితర సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నది.
MG Motor-Reliance | విభిన్న రంగాల్లోకి వ్యాపారాలు విస్తరిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. తాజాగా ఆటోమొబైల్ రంగంలో కూడా ప్రవేశిస్తుందా? అంటే.. అవుననే సమాధానమే వస్తున్నది. బ్రిటిష్ కార్ల తయారీ బ్రాండ్.. చైనా ఆటో జెయింట్ ఎస్ఏఐసీ యాజమాన్యంలో పని చేస్తున్న ఎంజీ మోటార్ ఇండియా.. సంస్థలో మెజారిటీ వాటా వదులుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఇందుకు సరైన సంస్థలకు ఈక్విటీ విక్రయించడానికి ఎంజీ మోటార్ ఇండియా చర్చలు అడ్వాన్స్ దశలో ఉన్నాయని సమాచారం. రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరో గ్రూప్, ప్రేమ్ జీ ఇన్వెస్ట్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ సంస్థలతో ఎంజీ మోటార్ ఇండియా సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ సంస్థ వర్గాల కథనం.
భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో భారతదేశంలో తాజా పెట్టుబడులు పెట్టడానికి ఎంజీ మోటార్ ఇండియా యాజమాన్య సంస్థ ‘ఎస్ఏఐసీ’కి రెగ్యులేటరీపరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తదుపరి దశ గ్రోత్ సాధనకు, స్థానిక భాగస్వాములను కూడగట్టుకోవాలని ఎంజీ మోటార్ ఇండియా తలపోస్తున్నది. గుజరాత్ రాష్ట్రంలో కార్లు.. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ కార్ల తయారీకి రూ.5000 కోట్ల పెట్టుబడులు అవసరం.
భారత్ కంపెనీలతో ఎంజీ మోటార్ ఇండియా యాజమాన్యం ఎడతెగని సంప్రదింపులు జరుపుతున్నది. ఈ ఏడాది చివరికల్లా ఒప్పందం ఖరారు కావచ్చునని ఆ సంస్థ వర్గాల కథనం. విశ్వసనీయమైన భాగస్వామి కోసం ఎంజీ మోటార్ ఇండియా ఎదురు చూస్తున్నది. 2028 నాటికి గుజరాత్ లో ఎలక్ట్రిక్ కార్ల తయారీకి రూ.5000 కోట్ల పెట్టుబడులు అవసరం. తద్వారా 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఎంజీ మోటార్ ఇండియా యాజమాన్యం సంప్రదింపులపై స్పందించడానికి రిలయన్స్, హీరో గ్రూప్, ప్రేమ్ జీ ఇన్ వెస్ట్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ నిరాకరించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

