న్యూఢిల్లీ, డిసెంబర్ 18: జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా.. వచ్చే నెల జనవరి నుంచి తమ వాహనాల ధరలు మాడల్నుబట్టి 2 శాతం వరకు పెరుగుతాయని గురువారం ప్రకటించింది. తయారీ ఖర్చులు పెరుగడం వల్లే కార్ల రేట్లను పెంచాల్సి వస్తున్నదని ఓ ప్రకటనలో సంస్థ వివరించింది.
కాగా, ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ సైతం కొత్త ఏడాది నుంచి తమ వాహన ధరలు పెరుగుతాయని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.