Meta Vs Open AI | ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం భారీగా పెరిగింది. ఈ క్రమంలో టెక్ కంపెనీల మధ్య పోటీ తీవ్రతరమైంది. తాజాగా, Open AI CEO సామ్ ఆల్ట్‌మన్ చేసిన మెటా కంపెనీపై సంచలన ఆరోపణలు చేశారు. సామ్ ఆల్ట్‌మన్ మాట్లాడుతూ.. మెటా కంపెనీ Open AI ఉద్యోగులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తోందన్నారు. మెటా కంపెనీ కొందరు ఉద్యోగులకు మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.833 కోట్ల వరకు ఆఫర్ చేస్తుందని పేర్కొన్నారు. ఓపెన్ ఏఐ తమకు ప్రధాన పోటీదారుగా కనిపిస్తున్నందున వల్లే మెటా ఈ రీతిలో దూకుడుగా ప్రవర్తిస్తోందని ఆయన ఆరోపించారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక సైతం ఈ ఆరోపణలకు బలాన్ని ఇచ్చింది. నివేదిక ప్రకారం.. మెటా కంపెనీ ఓపెన్ ఏఐ జ్యూరిచ్ కార్యాలయంలో పని చేసిన ముగ్గురు ప్రముఖ ఏఐ పరిశోధకులు అలెగ్జాండర్ కోలెస్నికోవ్, లూకాస్ బేయర్, జియాహువా జై లను తీసుకుందని.. వీరు ఓపెన్ ఏఐలో అనుభవజ్ఞలని.. సాంకేతిక నిపుణులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.
కృత్రిమ మేథాలో వెనుకపడిపోతామన్న భయంతో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సూపర్ ఇంటెలిజెన్స్ టీమ్‌ను నిర్మించేందుకు ప్రతిభావంతులను తీసుకోవాలని నిర్ణయించారు. గత కొన్ని సంవత్సరాల్లో మెటా నుంచి అనేక మంది ఏఐ నిపుణులు బయటకు వెళ్లిపోయారు. దాంతో కంపెనీకి చెందిన ఏఐ ప్రాజెక్టుల వేగం మందగించింది. ఈ పరిస్థితిలో మార్పులు తీసుకువచ్చేందుకు రిక్రూట్మెంట్పై జుకర్ బర్గ్ దృష్టి సారించారు. ఓపెన్ ఏఐ, గూగుల్ వంటి కంపెనీలు ఏఐలో ముందు వరుసలో ఉండగా.. మెటా సైతం తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది.