Mercedes-Maybach EQS 680 | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఇండియా (Mercedes-Benz India) .. దేశీయ మార్కెట్లోకి అప్డేటెడ్ మెర్సిడెజ్ ఏఎంజీ జీఎల్సీ ఏ3 కూపె (Mercedes-AMG GLC A3 Coupe), మెర్సిడెజ్ సీఎల్ఈ కాబ్రియోలెట్ (Mercedes CLE Cabriolet) కార్లను ఆవిష్కరించింది. వచ్చే నెల ఐదో తేదీన మెర్సిడెజ్ మే బ్యాచ్ ఈక్యూఎస్ 680 లగ్జరీ ఈవీ (Mercedes Maybach EQS) కారును ఆవిష్కరిస్తామని తెలిపింది. ఈ కారు ధర రూ.4 కోట్ల (ఎక్స్ షోరూమ్) వరకూ ఉండొచ్చునని భావిస్తున్నారు.
మెర్సిడెజ్ మే బ్యాచ్ ఈక్యూఎస్ 680 లగ్జరీ ఈవీ (Mercedes Maybach EQS) కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తే అత్యంత ఖర్చుతో కూడుకున్న కారుగా నిలుస్తుందని భావిస్తున్నారు. గతేడాది ఏప్రిల్లో మెర్సిడెజ్ మే బ్యాచ్ ఈక్యూఎస్ 680 లగ్జరీ ఈవీ (Mercedes Maybach EQS) కారు గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించారు. గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించిన డిజైన్.. దేశీయంగానూ వస్తుందని భావిస్తున్నారు. స్టాండర్డ్ మోడల్ కంటే మరింత ప్రీమియం, విలాసవంతమైన లుక్ కలిగి ఉంటుంది.
మెర్సిడెజ్ మే బ్యాచ్ ఈక్యూఎస్ 680 లగ్జరీ ఈవీ (Mercedes Maybach EQS) కారు హ్యాండ్ అప్లయిడ్ పిన్స్ట్రిప్ సిగ్నేచర్ డ్యుయల్ టోన్ పెయింట్ తో వస్తోంది. గ్లోబల్ మార్కెట్లలో ఫైవ్ టూ-టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. హైటెక్ సిల్వర్ లేదా ఒబ్సిడియన్ బ్లాక్, హైటెక్ సిల్వర్ లేదా నాటికల్ బ్లూ, ఒబ్సిడియాన్ బ్లాక్ లేదా సెలెనైట్ గ్రే, ఒబ్సిడియన్ బ్లాక్ లేదా కలహరి గోల్డ్, వెల్వెట్ బ్రౌన్ లేదా ఓన్యిక్స్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. భారత్ మార్కెట్లో ఏయే రంగుల్లో వస్తుందో తెలియాల్సి ఉంది. ఎస్ 680, జీఎల్ఎస్ 600 మోడల్ కార్లలో మాదిరిగా క్రోమ్ ప్లేటెడ్ వెర్టికల్ లైన్స్, మే బ్యాచ్ గ్రిల్లే రిమిన్ స్కెంట్ వంటి ఫీచర్లు ఉంటాయి.
క్రోమ్ సరౌండ్స్ విండోస్, డీ-పిల్లర్ పై మే బ్యాచ్ ఎంబ్లం, బాయ్నెట్ మీద త్రీ పాయింటెడ్ స్టార్ బ్యాడ్జ్ ఉంటుంది.
ఎంబీయూఎక్స్ హైపర్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, టైలర్డ్ విత్ ఎక్స్ క్లూజివ్ మే బ్యాచ్ థీమ్స్ అండ్ కలర్ స్కీమ్స్, వెంటిలేషన్ తోపాటు రేర్ ఎగ్జిక్యూటివ్ సీట్లు, మసాజ్ ఫంక్షన్స్, నెక్ అండ్ షౌల్డర్ హీటింగ్, రేర్ ప్యాసింజర్ల కోసం రెండు 11.6 అంగుళాల డిస్ ప్లేలు, ఎంబీయూఎక్స్ రేర్ టాబ్లెట్, ఎంబీయూఎక్స్ ఇంటీరియర్ అసిస్ట్ తదితర ఫీచర్లు ఉంటాయి. కస్టమర్లు టూ క్లైమేట్ కంట్రోల్డ్ కప్ హోల్డర్లు, రీ డిజైన్డ్ సెంటర్ కన్సోల్ ఎక్స్ టెన్షన్, రెండు ఫోల్డింగ్ టేబుళ్లు, కూలింగ్ కంపార్ట్ మెంట్, సిల్వర్ ప్లేటెడ్ చాంపేన్ గోబ్లెట్స్, వెనక ప్యాసింజర్లు కూర్చోవడానికి వీలుగా ఫ్రంట్ ప్యాసింజర్ పీట్ ఫోల్డింగ్ చాఫర్ ప్యాకేజీ ఉంటాయి.
మెర్సిడెజ్ మే బ్యాచ్ ఈక్యూఎస్ 680 లగ్జరీ ఈవీ (Mercedes Maybach EQS) కారు 108 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తోంది. రెండు మోటార్లు గరిష్టంగా 649 బీహెచ్పీ విద్యుత్, 950 ఎన్ఎం టార్క్ వెలువరిస్తాయి. 4.4 సెకన్లలో 100 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. గరిష్టంగా గంటకు 210 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. 22 కిలోవాట్ల ఆన్ బోర్డ్ ఏసీ చార్జర్ తో పూర్తి స్థాయిలో చార్జింగ్ అయితే 600 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. పూర్తి స్థాయిలో చార్జింగ్ కావడానికి 6.15 గంటలు పడుతుంది. బ్యాటరీ చార్జింగ్ కోసం 200 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ చార్జర్ కూడా వాడొచ్చు. ఎకో, స్పోర్ట్, ఆఫ్ రోడ్, ఇండివిడ్యుయల్ మోడ్స్ లో అందుబాటులో ఉంటుంది.