న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: మెర్సిడెజ్ బెంజ్..ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ‘డ్రీమ్ డేస్’ పేరుతో ప్రత్యేక ప్రచారానికి శ్రీకారంచుట్టింది. కార్లను కొనుగోలుచేసేవారికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించనున్నట్టు ప్రకటించింది.
సీజనల్ పేమెంట్లు, జీరో డౌన్‌పేమెంట్, ట్రేడ్ బెనిఫిట్ ప్రయోజనాలు కల్పించనున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు.