న్యూఢిల్లీ, డిసెంబర్ 5 : మీషో ఐపీవోకి కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. సంస్థ జారీ చేసినదానికంటే 79 రెట్ల అధిక బిడ్డింగ్‌లు దాఖలయ్యాయి. రూ.5,421 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి 27,79,38,446 షేర్లను జారీ చేయగా.. 21,96,29,80,575 షేర్ల బిడ్డింగ్‌లు వచ్చాయి.
అలాగే క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ 120 రెట్లు అధిక సబ్‌స్ర్కైబ్ కాగా, నాన్-ఇనిస్టిట్యూషనల్ 38 రెట్లు, రిటైల్ 19 రెట్లు బిడ్లు వచ్చాయి. షేరు ధరల శ్రేణిని రూ.105-111గా నిర్ణయించింది. తాజా షేర్లను జారీచేయడం ద్వారా రూ.4,250 కోట్లు, అలాగే ఓఎఫ్ఎస్ రూ ట్లో రూ.1,171 కోట్ల విక్రయించింది.