Meesho | ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో ఉద్యోగలుకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తొమ్మిదిరోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఏ పని లేకుండా సెలవులను ఎంజాయ్ చేయవచ్చని చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించింది. గతంలో కంపెనీ మూడుసార్లు ఇదే తరహాలో ఉద్యోగాలు రీచార్జ్ అయ్యేందుకు సెలవులు ఇచ్చింది. తాజాగా మరోసారి సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంది.
సెలవుల దినాల్లో ల్యాప్ ట్యాప్స్ ఉండవని.. మీటింగ్స్ ఉండవని.. ఎలాంటి మెయిల్స్ రావని.. స్టాండప్ కాల్స్ ఉండవని.. ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి పనులు ఉండవని చెప్పింది. ఈ నెల 26 నుంచి నవంబర్ 3 వరకు ‘రెస్ట్ అండ్ రీచార్జ్ బ్రేక్’ ఇస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. దసరా, దీపావళి పండుగ నేపథ్యంలో మెగాబస్టర్ సేల్స్ నిర్వహిస్తున్న విషయం విధితమే. ఈ మెగా బ్లాక్‌బస్టర్ తర్వాత ఉద్యోగులు రెస్ట్ తీసుకునేలా మీషో అశకావం కల్పించింది. తొమ్మిది రోజుల బ్రేక్‌తో ఉద్యోగులు, సిబ్బంది మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నది.