సేఫ్టీ గ్లాస్ నుంచి స్టెంట్ల వరకు..!
- వైద్య పరికరాల తయారీలో కంపెనీల వేగం
- మెడికల్ డివైజెస్ పార్క్‌కు అపూర్వ స్పందన
- హెల్త్‌హబ్‌గా హైదరాబాద్ ఖ్యాతి విస్తృతం
ప్రాణం పోసే ఔషధాలు తయారు చేసే ఫార్మా క్యాపిటల్‌గా ఖ్యాతిగాంచిన హైదరాబాద్, వైద్య పరికరాల తయారీలోనూ తనదైన ముద్ర వేస్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో పటాన్చెరు సమీపంలోని సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటుచేసిన మెడికల్ డివైజెస్ పార్కులో ఇప్పటికే సేఫ్టీ గ్లాస్ నుంచి స్టెంట్లు తయారవుతున్నాయి.

హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): వైద్య పరికరాల తయారీకోసం దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక మెడికల్ డివైజెస్ పార్కును సుల్తాన్‌పూర్‌లో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు దాదాపు 31 కంపెనీలకు స్థలాలను కేటాయించగా, పలు కంపెనీలు ఉత్పత్తులు ప్రారంభించాయి. సుమారు రూ.4,511 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. 2,492 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రోమియా థెరప్యూటిక్స్, ఆకృతి ఆక్యులోప్లాస్టీ లాజిస్టిక్స్, ఎల్వికాన్ ఇండియా తదితర సంస్థలు ఇప్పటికే ఉత్పత్తులు ప్రారంభించగా, ఎస్వీపీ టెక్నో ఇంజినీర్స్, ఆర్కా మెడికల్ డివైజెస్, బ్లూమ్ వేర్‌హౌసింగ్ డివైసెస్, రెనోడ్ బయో, ఫ్లెక్స్‌డ్ టెక్నోప్యాక్, రీస్ మెడిలైఫ్, సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్, అపాజ్ ఇండియా ఇండస్ట్రీస్ తదితర సంస్థలు ఉత్పత్తి ప్రారంభించే దశలో ఉన్నాయి.
ఇక్కడి నుంచే విదేశాలకు..
ఫార్మా ఉత్పత్తుల్లో దేశంలో మూడో వంతు రాష్ట్రం నుంచే సరఫరా అవుతున్నాయి. ఇప్పటికే దాదాపు 300 కంపెనీలు ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. పలు కంపెనీలకు యూఎస్ ఎఫ్‌డీఏ గుర్తింపు కూడా ఉండడంతో, అమెరికా, యూరప్ దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో సుమారు 18,304ఎకరాల్లో ఫార్మాసిటీని నెలకొల్పుతున్నది. ఇప్పటికే సగానికిపైగా భూసేకరణ పూర్తయింది. దీనికి అనుబంధంగా సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్కు నెలకొల్పింది.
వివిధ సంస్థలు తయారుచేస్తున్న ఉత్పత్తులు
ప్రోమియా: హెచ్ఐవీ, ఇతర వైరస్‌లను గుర్తించే పరికరాలు, రక్తాన్ని నిల్వచేసేందుకు ఉపయోగించే బ్యాగ్స్
ఆకృతి: సేఫ్టీ గ్లాసెస్, ఫేస్‌షీల్డ్, ఆక్యులర్ ఇంప్లాంట్స్.
సహజానంద్: స్టెంట్లు, గుండె చికిత్సలో ఉపయోగించే పరికరాలు
ఎల్వికాన్: నానో మైక్రాన్ పార్టికల్స్, డిజిటల్ అనలాగ్ సెన్సర్స్, థర్మల్ ఇన్సులేషన్ మెటీరియల్. పరిశోధన, అభివృద్ధి సేవలు.
ఎస్వీపీ: లినియర్ మోషన్ ప్రొడక్ట్స్, ప్లానిటరీ గేర్ యూనిట్స్.
సర్వో డ్రైవ్ సిస్టమ్స్: లినియర్ బేరింగ్స్, హెడ్ ఆపరేటెడ్ పిస్టన్ పంప్స్,పొజిషన్ సెన్సర్స్, బాల్స్య్క్రూ.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

