Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ టాప్-10 సంస్థలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,95,061 కోట్లు కోల్పోయాయి. ఈక్విటీ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్ దీనికి కారణం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్ భారీగా నష్టపోయాయి. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 4,091.53 పాయింట్లు (4.98 శాతం) పతనమైంది. 2022 జూన్ తర్వాత ఎన్ఎస్ఈ నిఫ్టీ 4.77 వాతం నష్టంతోపాటు భారత్ ఈక్విటీ మార్కెట్ భారీగా పతనం కావడం ఇదే ప్రథమం. వడ్డీరేట్ల తగ్గింపుపై యూఎస్ ఫెడ్ రిజర్వ్ ప్రకటన వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. నాలుగు సార్లు వడ్డీరేట్లు తగ్గిస్తారన్న అంచనాలకు బదులు 2025లో రెండు సార్లు మాత్రమే వడ్డీరేట్లు తగ్గిస్తాం అని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు.
టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,10,550.66 కోట్లు నష్ట పోయి రూ.15,08,036.97 కోట్లకు చేరుకున్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.91,140.53 కోట్ల పతనంతో రూ.16,32,004.17 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.76,448.71 కోట్లు కోల్పోయి రూ.13,54,709.35 కోట్ల వద్ద నిలిచింది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.59,055.42 కోట్లు నష్టంతో రూ.8,98,786.98 కోట్ల వద్ద ముగిసింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.43,909.13 కోట్లు నష్టంతో రూ.7,25,125.38 కోట్లకు చేరుకున్నది.
ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.41,857.33 కోట్ల పతనంతో రూ.9,07,449.04 కోట్ల వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.32,300.2 కోట్ల పతనంతో రూ.7,98,086.90 కోట్ల వద్ద నిలిచింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఎం-క్యాప్ రూ.20,050.25 కోట్ల నష్టంతో రూ.5,69,819.04 కోట్ల వద్ద స్థిర పడింది. హిందూస్థాన్ యూనీ లివర్ ఎం-క్యాప్ రూ.12,805.27 కోట్లు పతనమై రూ.5,48,617.81 కోట్లకు చేరుకుంది. ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,943.5 కోట్లు పతనమై రూ.5,81,252.32 కోట్ల వద్ద ముగిసింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-10 సంస్థల్లో టాప్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, భారతీయ స్టేట్ బ్యాంక్, ఐటీసీ, ఎల్ఐసీ, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) నిలిచాయి.