Market Capitalisation | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలోని టాప్-10 సంస్థల్లో తొమ్మిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,29,589.86 కోట్లు పెరిగింది. ఇందులో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) భారీగా లబ్ధి పొందింది. గతవారం మార్కెట్లలో ర్యాలీ నేపథ్యంలో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 685.68 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 223.85 పాయింట్లు వృద్ధి చెందాయి.
భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.60,656.72 కోట్లు వృద్ధి చెంది రూ.6,23,202.02 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎం-క్యాప్ రూ.39,513.97 కోట్లు పుంజుకుని రూ.13,73,932.11 కోట్ల వద్ద నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.35,860.79 కోట్లు పెరిగి రూ.17,48,991.54 కోట్ల వద్ద ముగిసింది.
భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.32,657.06 పెరిగి రూ.9,26,725.90 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,482 కోట్ల వృద్ధితో 7,48,775.62 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,858.02 కోట్లు పుంజుకుని రూ.9,17,724.24 కోట్ల వద్ద ముగిసింది.
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.11,947.67 కోట్లు పెరిగి రూ.5,86,516.72 కోట్ల వద్ద స్థిర పడింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ.10,058.28 కోట్లు వృద్ధి చెంది రూ.15,46,207.79 కోట్లకు చేరుకున్నది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.2,555 కోట్లు పెరిగి రూ.5,96,828.28 కోట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,477.5 కోట్లు వృద్ధి చెంది రూ.7,71,674.33 కోట్లకు చేరింది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ టాప్ సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో కొనసాగింది. తర్వాత జాబితాలో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీసీ, హిందూస్థాన్ యూనీ లివర్ నిలిచాయి.