Market Capitalisation | గతవారం దేశీయ మార్కెట్ల ట్రేడింగ్‌లో టాప్-10 సంస్థల్లో నాలుగు సంస్థలు రూ.56,006 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. వీటిల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ ద్వయం భారీగా నష్టపోయాయి. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 58.15 పాయింట్లు (0.09 శాతం) నష్టంతో ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీయ స్టేట్‌బ్యాంక్ (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ నష్టాలను చవి చూశాయి. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), ఐటీసీ, ఇన్ఫోసిస్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.44,540.05 కోట్లు పెరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో హెచ్డీఎఫ్సీ విలీనం కానుండటంతో రెండు సంస్థల షేర్లు భారీగా పతనం అయ్యాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.34,547.61 కోట్ల నష్టంతో రూ.9,07,505.07 కోట్లతో సరిపెట్టుకున్నది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.13,584.9 కోట్ల పతనంతో రూ.4,95,541.41 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,356.46 కోట్లు కోల్పోయి రూ.4,39,153.22 కోట్ల వద్ద నిలిచింది.
రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,279.06 కోట్లు వృద్ధి చెంది రూ.16,51,687.33 కోట్లకు దూసుకెళ్లింది. హిందూస్థాన్ యూనీ లివర్ ఎం-క్యాప్ రూ.10,949.09 కోట్ల లబ్ధితో రూ.5,87,632.77 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6,583.1 కోట్లు పెరిగి రూ.6,47,532.81 కోట్ల వద్ద ముగిసింది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.5,433.69 కోట్లు పెరిగి రూ.11,82,184.61 కోట్ల వద్ద స్థిర పడింది. ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,598.37 కోట్లు వృద్ధి చెంది రూ.5,32,975.54 కోట్ల వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.2,696.74 కోట్లు లాభ పడి రూ.5,22,358.84 కోట్ల వద్ద స్థిర పడింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో మార్కెట్ లీడర్‌గా రిలయన్స్ కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీలివర్, ఐటీసీ, ఇన్పోసిస్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ నిలిచాయి.