Market Capitalisation | గతవారం ట్రేడింగ్‌లో టాప్-10 స్టాక్స్‌లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,35,794.06 కోట్లు పెరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), రిలయన్స్ భారీగా లబ్ధి పొందాయి. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), భారతీ ఎయిర్టెల్ స్టాక్స్ నష్టపోయాయి. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 995.45 పాయింట్లు (.166 శాతం) లాభంతో ముగిసింది.
ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.35,029.1 కోట్లు పెరిగి రూ.5,47,257.19 కోట్లకు దూసుకెళ్లింది. రిలయన్స్ ఎం-క్యాప్ రూ. 31,568.08 కోట్లు వృద్ధి చెంది రూ.17,23,979.45 కోట్ల వద్ద స్థిర పడింది. అదానీ ఎంటర్ప్రైజెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 24,898.33 కోట్లు లాభ పడి రూ.4,39,966.33 కోట్ల వద్ద నిలిచింది. ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.16,535.08 కోట్లు పుంజుకుని రూ. 9,07,505.41 కోట్ల వద్ద ముగిసింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,690.67 కోట్లు లాభ పడి రూ.11,92,576.32 కోట్లకు చేరుకున్నది. ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.8,221.94 కోట్లు వృద్ధి చెంది రూ.6,21,588.34 కోట్ల వద్ద స్థిర పడింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,692.01 కోట్లు లాభ పడి రూ. 6,34,873.16 కోట్ల వద్ద నిలిచింది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.3,158.85 కోట్లతో రూ.4,81,437.47 కోట్లకు పెరిగింది.
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,121.05 కోట్లు నష్టపోయి రూ. 6,01,436.62 కోట్ల వద్ద సరిపెట్టుకున్నది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ. 890.49 కోట్లు పతనమై రూ.4,48,977.72 కోట్ల వద్ద నిలిచింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్ లీడ్‌లో కొనసాగుతుండగా, తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్పోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్, అదానీ ఎంటర్ ప్రైజెస్ నిలిచాయి.
గతేడాది దలాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్లు రూ.16.38 లక్షల కోట్ల పై చిలుకు లబ్ధి పొందారు. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,38,036.38 కోట్లు వృద్ధి చెంది రూ.2,82,38,247.93 కోట్లకు పెరిగింది.