Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,10,330.26 కోట్లు పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) భారీగా లబ్ధి పొందగా, రిలయన్స్ నష్టపోయింది. బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ 85.31 పాయింట్ల లాభంతో ముగిసింది. శుక్రవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్ లో 81,587.76 పాయింట్ల జీవిత కాల గరిష్టాన్ని తాకింది. మొహరం సందర్భంగా బుధవారం స్టాక్ మార్కెట్లకు సెలవు.
టాప్-10 సంస్థల్లో టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.42,639.16 కోట్ల వృద్ధితో రూ.15,56,772.61 కోట్లకు చేరుకున్నది. ఎల్ఐసీ ఎం-క్యాప్ రూ.36,748.23 కోట్లు పుంజుకుని రూ.7,01,695.24 కోట్ల వద్ద స్థిర పడింది. ఇన్పోసిస్ ఎం-క్యాప్ రూ.33,569.16 కోట్లు పెరిగి రూ.7,44,396.43 కోట్ల వద్ద ముగిసింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.26,372.23 కోట్ల నుంచి రూ.7,93,576.49 కోట్ల వద్ద నిలిచింది.
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,494.49 కోట్ల లాభంతో రూ.6,40,651.30 కోట్లకు చేరుకున్నది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.19,420.52 కోట్లు పుంజుకుని రూ.5,92,679.30 కోట్ల వద్ద నిలిచింది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.16,223.03 కోట్ల నుంచి రూ.8,31,928.39 కోట్లకు పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.10,863.44 కోట్లు పెరిగి రూ.8,78,531.60 కోట్ల వద్ద స్థిర పడింది.
మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.56,799.01 కోట్లు నష్టపోయి రూ.21,03,829.74 కోట్లకు పరిమితమైంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.13,124.01 కోట్ల పతనంతో రూ.12,22,701.34 కోట్లతో సరిపెట్టుకున్నది. గత వారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, భారతీయ స్టేట్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎల్ఐసీ, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ నిలిచాయి.