Investers Wealth | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టంతో టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,55,721.12 కోట్లు హరించుకు పోయింది. గతవారం మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా నష్టపోయిన సంస్థల్లో రిలయన్స్ నిలిచింది. గత వారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 237.8 పాయింట్లు (0.29 శాతం) నష్టంతో ముగిసింది. రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా నష్టపోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ వృద్ధి చెందింది.
రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.74,563.37 కోట్లు నష్టపోయి రూ.17,37,556.68 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.26,274.75 కోట్లు కోల్పోయి రూ.8,94,024.60 కోట్ల వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,254.79 కోట్లు కోల్పోయి రూ8,88,432.06 కోట్ల వద్ద నిలిచింది.
ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,449.47 కోట్ల నష్టంతో రూ.5,98,213.49 కోట్లకు చేరుకున్నది. ఎల్ఐసీ ఎం-క్యాప్ రూ.9,930.25 కోట్ల పతనంతో రూ.5,78,579.16 కోట్ల వద్ద ముగిసింది. హిందూస్థాన్ యూనీ లివర్ ఎం-క్యాప్ రూ.7,248.49 కోట్లు పతనమై రూ.5,89,160.01 కోట్ల వద్ద స్థిర పడింది.
మరోవైపు టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.57,744.68 కోట్లు పుంజుకుని రూ.14,99,697.28 కోట్లకు పెరిగింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.28,838.95 కోట్లు వృద్ధి చెంది.. రూ.7,60,281.13 కోట్లకు చేరుకున్నది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.19,812.65 కోట్లు పెరిగి రూ.7,52,568.58 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎం-క్యాప్ రూ.14,678.09 కోట్లు పెరిగి రూ.13,40,754.74 కోట్ల వద్ద నిలిచింది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీయ స్టేట్ బ్యాంకు, ఐటీసీ, హిందూస్థాన్ యూనీ లివర్, ఎల్ఐసీ నిలిచాయి.