Market Capitalisation | గతవారం ముగిసిన ట్రేడింగ్‌లో టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,13,703.82 కోట్లు పెరిగింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లబ్ధి పొందింది. ఈక్విటీ మార్కెట్లో గత వారం బుల్లిష్ ట్రెండ్ కొనసాగింది. తత్ఫలితంగా గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 758.95 పాయింట్లు లేదా 1.21 శాతం లాభ పడింది. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 466.95 పాయింట్లు లబ్ధితో ట్రేడింగ్ ముగిసే సమయానికి 63,384.58 పాయింట్ల ఆల్ టైం గరిష్ట స్థాయి నమోదు చేసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు హిందూస్థాన్ యూనీ లివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్), ఐటీసీ, ఇన్పోసిస్, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ భారీగా లబ్ధి పొందాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్టాక్స్ నష్టాలతో ముగిశాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.63,259.05 కోట్లు వృద్ధి చెంది రూ.17,42,415.47 కోట్ల వద్ద ముగిసింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) ఎం-క్యాప్ రూ.18,737.99 కోట్లు లబ్ధి చెంది రూ.6,38,019.76 కోట్ల వద్ద స్థిర పడింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.18,331.32 కోట్లు పెరిగి రూ.5,63,237.76 కోట్ల వద్ద నిలిచింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,059.41 కోట్లు లాభపడి రూ.5,36,433.55 కోట్లకు చేరుకున్నది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.2,016.08 కోట్లు పెరిగి రూ.4,66,412.79 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.299.97 కోట్ల వృద్ధితో రూ.4,89,496.34 కోట్లకు చేరుకున్నది.
మరోవైపు టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,879.86 కోట్లు నష్టపోయి రూ.11,61,840.29 కోట్లతో సరిపెట్టుకున్నది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.6,514.97 కోల్పోయి రూ.5,09,863.08 కోట్ల వద్ద నిలిచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.4,722.95 కోట్ల పతనంతో రూ.8,95,458.57 కోట్ల వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.1,882.67 కోట్ల నష్టంతో రూ.6,53,980.16 కోట్ల వద్ద స్థిర పడింది. గత వారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10లో రిలయన్స్ లీడర్‌గా కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్, ఐటీసీ, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ నిలిచాయి.