Reliance | గతవారం ట్రేడింగ్లో దేశీయస్టాక్ మార్కెట్లలో టాప్-10 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,68,552.42 కోట్ల మేరకు నష్టపోయాయి. వాటిల్లో మార్కెట్ లీడర్ రిలయన్స్ భారీగా నష్టపోయింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1492.52 పాయింట్లు (2.43 శాతం) నష్టపోయింది. చైనాతోపాటు పలు దేశాల్లో కొవిడ్-19 కేసులు పెరిగిపోవడం, అమెరికా ఫెడ్ రిజర్వ్ వైఖరి నేపథ్యంలో దేశీయ స్టాక్స్ నష్టపోయాయి.
రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.42,994.44 కోట్లు పతనమై రూ.16,92,411.37 కోట్ల వద్ద స్థిర పడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.26,193.74 కోట్ల నష్టంతో రూ.5,12,228.09 కోట్లతో ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,755.96 కోట్ల పతనంతో రూ.8,90,970.33 కోట్ల వద్ద నిలిచింది.
భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,690.03 కోట్ల నష్టంతో రూ.4,16,848.97 కోట్లతో సరిపెట్టుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.16,014.14 కోట్లు పతనమై రూ.6,13,366.40 కోట్ల వద్ద నిలిచింది. హిందూస్థాన్ యూనీ లివర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,877.18 కోట్లు కోల్పోయి రూ.6,15,557.67 కోట్ల వద్ద స్థిర పడింది.
ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.10,436.04 కోట్లు నష్టపోయి రూ.6,30,181.15 కోట్ల వద్ద నిలిచింది. హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,181.86 కోట్లు కోల్పోయి రూ.4,78,278.62 కోట్లకు చేరుకున్నది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.7,457.25 కోట్ల నష్టంతో రూ.4,49,868.21 కోట్ల వద్ద స్థిర పడింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ.3,951.78 కోట్లు పతనమై రూ.11,80,885.65 కోట్లతో ముగిసింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీలివర్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్, ఎల్ఐసీ నిలిచాయి.