Maruti Suzuki | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకికి గట్టి షాక్ తగిలింది. మారుతి సుజుకి మార్కెటింగ్ విభాగం వైస్‌ప్రెసిడెంట్‌గా పని చేస్తున్న వినయ్ పంత్ రాజీనామా చేశారు. మరో ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్‌లో చేరారు. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ గ్లోబల్ మార్కెటింగ్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. వినయ్ పంత్‌కు మారుతి సుజుకితో 15 ఏండ్ల సుదీర్ఘ అనుబంధం ఉంది.
మారుతి సుజుకి కన్జూమర్ ఇన్సైట్స్ విభాగం హెడ్‌గా 2007 జూన్‌లో వినయ్ పంత్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు రెక్కిట్ బెంకిసర్ సౌత్ ఏషియా రీజనల్ రీసెర్చ్ మేనేజర్‌గా పని చేశారు. దానికి ముందు 1996లో హీరో మోటో కార్ప్ స్ట్రాటర్జిక్ ప్లానింగ్ మేనేజర్‌గా సేవలందించారు. ఐఎంఆర్బీ ఇంటర్నేసనల్, టీఎన్ఎస్ ఎన్ఎఫ్వో, జీఎఫ్కే వంటి సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది.
మారుతి సుజుకి గత నెలలో 1,32,395 యూనిట్లు విక్రయించింది. గతేడాది నవంబర్ సేల్స్‌తో పోలిస్తే, గత నెలలో 20.6 శాతం వృద్ధి నమోదు చేసింది. కానీ, గతేడాదితో పోలిస్తే 21,393 యూనిట్ల నుంచి 19,738 యూనిట్లకు పడిపోయాయి. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో మారుతి సుజుకి పాపులర్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ కార్లకు వన్ స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది.