న్యూఢిల్లీ, డిసెంబర్ 17: దేశీయ ఆటో రంగ దిగ్గజ సంస్థ మారుతి సుజుకీ బుధవారం తమ పాపులర్ మాడల్ వాగనార్ కారును స్వివెల్ సీటుతో పరిచయం చేసింది. రోజువారీ ప్రయాణంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఓ ప్రకటనలో సంస్థ పేర్కొన్నది.
ఇక ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-10 కార్లలో మారుతి వాగనార్ ఒకటి. అందుకే ఇందులో స్వివెల్ సీటును పెట్టామని కంపెనీ ఎండీ సీఈవో హిసాషి టకెవుచి అన్నారు. హైదరాబాద్లో వాగనార్ ధర రూ.5.87-8.46 లక్షల మధ్య ఉన్నది.